పింఛన్ దరఖాస్తు గడువు పొడిగించాలి.. ప్రభుత్వాన్ని కోరిన సంఘం నాయకులు
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
చిట్వేల్లో ఏపీ వికలాంగులు, పింఛన్దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.ఎన్. ఆంధ్రయ్య ప్రభుత్వాన్ని కీలక విజ్ఞప్తి చేశారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలని ఆయన కోరారు.
ప్రస్తుతం కేవలం పది రోజులే సమయం ఉండటం, ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం కారణంగా అర్హులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు, ఇంటి స్థలాలు, సబ్సిడీ రుణాలు కల్పించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.