పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అంటూ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పిలుపు
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా గంట్యాడ జడ్పీ పాఠశాలలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి పాల్గొని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. ఆరోగ్యకరమైన వాతావరణం కోసం పంచాయతీ అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.