నెల్లూరు జిల్లా ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులకు కరవైన భద్రత
రిపోర్టర్: రాజేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులకు భద్రత కరవైంది. నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగిస్తున్న ప్రధాన బస్టాండ్లలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, అరకొర వసతులు ఉండటంతో దొంగలు రెచ్చిపోతున్నారు. కావలి బస్టాండ్లో మహిళల బ్యాగు నుంచి ఇరవై సవర్ల బంగారం అపహరణకు గురైంది. పోలీస్ అవుట్పోస్టులు లేకపోవడం, నిఘా కొరవడటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.