ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజీ ప్రమాదం: చికిత్స పొందుతూ కార్మికుడు మృతి
రిపోర్టర్: రాము
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోహెన్స్ ఫార్ములా కెమికల్ పరిశ్రమలో జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికుడు పుప్పాల వెంకన్న హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. అర్వపల్లి మండలం పర్సాయపల్లి గ్రామానికి చెందిన వెంకన్న మృతితో పరిశ్రమలో కార్మికుల భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల పరిశ్రమలోని బ్లాక్-1లో రియాక్టర్ నుంచి గ్యాస్ లీకై విషవాయువులు వ్యాపించడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.