ది ప్యారడైజ్ విజయంపై హర్షం వ్యక్తం చేసిన నాని
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
ది ప్యారడైజ్ సినిమా విజయంపై హీరో నాని సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రేక్షకులు చూపించిన ప్రేమకు, చేసిన సరదా ట్రోల్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించిన తీరు హృదయాన్ని హత్తుకుందని, విమర్శకుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని నాని పేర్కొన్నారు. ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకే రక్తం, చెమట చిందించి ఈ సినిమా రూపొందించామని ఆయన స్పష్టం చేశారు.