కివు సరస్సులో పడవ బోల్తా పడి పన్నెండు మంది దుర్మరణం
రిపోర్టర్: సురేష్
స్థలం: కాంగో
ఆఫ్రికా దేశం కాంగోలోని తూర్పు ప్రాంతంలో ఉన్న కివు సరస్సులో శనివారం రాత్రి ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో కనీసం పన్నెండు మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గల్లంతయ్యారని అధికారులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో పడవలో యాభై మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.