ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని గోకుల్ ఆగ్రోస్ కు లోకేష్ ఆహ్వానం
రిపోర్టర్: అశోక్
స్థలం: అహ్మదాబాద్
గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ చైర్మన్ కనుభాయ్ ఠక్కర్ తో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్ లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెల్లూరు ప్లాంట్‌కు విస్తరణగా పామాయిల్, సోయాబీన్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చైర్మన్ కనుభాయ్ ఠక్కర్ తెలిపారు. దక్షిణాది మార్కెట్లకు సేవలు అందించేందుకు తమవద్ద విస్తరణ ప్రణాళికలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.