కల్వకుర్తిలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నాయకులను కల్వకుర్తి పోలీసులు సోమవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ ఘటనలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గా ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు బోడ నరసింహ, పరుశురాముడు, నరేష్ చారిలను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టుల అనంతరం నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. గొంతుకలను నొక్కివేయాలని చూస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని, పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం వీరందరినీ పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు.