మహిళలకు వ్యాపార అవకాశాలు.. రూ.10 లక్షల వరకు రాయితీ!

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయనగరం

మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మెప్మా ద్వారా ప్రత్యేక ప్రాజెక్టులను అమలు చేస్తోంది. విజయనగరం జిల్లాలో పట్టణ ప్రాంత మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో రుణాలు మంజూరు చేస్తున్నారు. పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద యూనిట్‌ ఖరీదులో 35 శాతం లేదా గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు రాయితీ కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.