స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాలకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాక
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఎస్పీ నెల్లూరు
వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు రజతోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభంకానున్నాయి. సోమవారం జరిగే ఈ వేడుకలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూపీ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు రజతోత్సవ సభలో యోగి ప్రసンగించనున్నారు.