సైబరాబాద్లో సైబర్ జాగరూకత దివస్ పోస్టర్ ఆవిష్కరణ: నేరాలపై ప్రత్యేక అప్రమత్తత
రిపోర్టర్: భాస్కర్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఎస్సీఎస్సీ సహకారంతో సైబరాబాద్ కమిషనరేట్ ఆడిటోరియంలో సైబర్ జాగరూకత దివస్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెల్లడించారు. ప్రజలలో డిజిటల్ నేరాలపై అవగాహన కల్పించి భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ మోసాల నివారణపై అవగాహన కల్పిస్తూ కీలకమైన పోస్టర్లను విడుదల చేశారు. పెరుగుతున్న ఆన్లైన్ మోసాలను అడ్డుకోవడానికి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని కమిషనరేట్ వర్గాలు పేర్కొన్నాయి.