రౌడీషీటర్ సూరి హత్య ప్రతీకార కుట్రను భగ్నం చేసిన పోలీసులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నెక్కొండ
రౌడీషీటర్ దాసరి సురేందర్ అలియాస్ సూరి హత్యకు ప్రతీకారంగా, కేసులో ప్రధాన నిందితుడు అర్ఫాజ్ను హతమార్చేందుకు పన్నిన కుట్రను హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీసులు భగ్నం చేశారు. నెక్కొండ మండలానికి చెందిన సూరి అనుచరుడు ఈ కుట్రలో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రెండు దేశవాళీ తుపాకులు, ఎనిమిది తూటాలు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు.