హైదరాబాద్ ఓఆర్ఆర్పై వేగ పరిమితి తగ్గింపు: సీపీ సజ్జనర్ కీలక లేఖ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు వేగ పరిమితిని గంటకు నూట ఇరవై కిలోమీటర్ల నుంచి నూటికి తగ్గించాలని రవాణా శాఖకు హైదరాబాద్ సీపీ సజ్జనర్ లేఖ రాసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేకుండా వేగం పెంచడం వల్ల గత రెండు సంవత్సరాలలో ప్రమాదాలు గణనీయంగా పెరిగాయని, ప్రాణ రక్షణ కోసం వెంటనే స్పందించి వేగ పరిమితిని తగ్గించడంతో పాటు పెట్రోలింగ్ వాహనాలను పెంచాలని ఆయన పేర్కొన్నారు.