రూపాయలు ఒకటిన్నర కోట్లతో తీస్తే వందల కోట్ల లాభమన్న అనుప్రియ
రిపోర్టర్: రమేష్
స్థలం: ముంబై
కేవలం ఒకటిన్నర కోట్ల రూపాయల తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన హనుమాన్ అంశ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి రూ.366 కోట్లకు పైగా వసూలు చేసిందని నిర్మాత అనుప్రియ నాగర్ తెలిపారు. సిద్ధార్థ్ కన్నన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను యాభై లక్షలు పెట్టుబడి పెట్టానని, ఎలాంటి పారితోషికం తీసుకోకుండా దర్శకుడు విశాల్ చతుర్వేది సహా అందరం లాభాలను పంచుకోనున్నామని, దీని ద్వారా తనకు యాభై కోట్ల వరకు రాబడి రావచ్చని స్పష్టం చేశారు.