ఎస్ఎస్సీ ఫేజ్-14 పరీక్షా నగరాల వివరాలు విడుదల
రిపోర్టర్: శివ
స్థలం: India
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫేజ్-14 సెలక్షన్ పోస్ట్స్ కంప్యూటర్ ఆధారిత పరీక్షా నగరాల వివరాలను విడుదల చేసింది. సెప్టెంబర్ 16 నుంచి 26 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఎగ్జామ్ సిటీ వివరాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే స్వంత స్క్రైబ్ సదుపాయం కోరుకునే అభ్యర్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎస్ఎస్సీ స్పష్టం చేసింది.