నాగ్పూర్-ముంబై దురంతో ఎక్స్ప్రెస్పై దుండగుల రాళ్ల దాడి

రిపోర్టర్: సతీష్ స్థలం: Nagpur

మహారాష్ట్రలోని బోర్ఖేడి సమీపంలో నాగ్పూర్ నుండి ముంబై వెళ్తున్న దురంతో ఎక్స్ప్రెస్పై శుక్రవారం రాత్రి దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రైలులోని మూడు ఏసీ కోచ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయని రైల్వే అధికారులు తెలిపారు. అయితే అదృష్టవశాత్తూ ప్రయాణీకులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.