గొల్లపల్లి మున్సిపల్ హైస్కూల్ కమిటీ నూతన సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లి శ్రీ వేణుగోపాల మున్సిపల్ ఉన్నత పాఠశాల కమిటీ నూతన పాలకవర్గ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పాఠశాల కమిటీ అధ్యక్షుడిగా పైల రమణ, ఉపాధ్యక్షురాలిగా శ్రీమతి బొద్దూరు వెంకటరత్నం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యా ప్రమాణాల పెంపునకు శ్రమిస్తామని స్పష్టం చేశారు. తమపై నమ్మకం ఉంచిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పాఠశాల సర్వాంగీణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.