దేశంలో దేశీయ పర్యాటకం భారం: విదేశీ టూర్ల కంటే గోవా యాత్రే ఖరీదు

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

దేశంలో పండగ సీజన్లలో దేశీయ పర్యాటకం విపరీతంగా ప్రియమవుతోందని పరిమళ్ అనే సోషల్ మీడియా వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. గోవా వంటి ప్రాంతాల్లో ఐదు రోజుల విహారయాత్ర ఖర్చు వియత్నాం లేదా బాలి వంటి విదేశీ టూర్లతో సమానంగా ఉంటోందని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. విపరీతమైన డిమాండ్ కారణంగా హోటల్ గదుల అద్దెలు, విమాన ప్రయాణ చార్జీలు భారీగా పెరుగుతున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.