భారత్‌లో సీఎస్‌ఏఎం డేటాను అందించేందుకు అంగీకరించిన మెటా
రిపోర్టర్: రమేష్
స్థలం: భారతదేశం
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా భారత్‌లో పిల్లల రక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ కేసులకు సంబంధించిన కీలక డేటాను భారత లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు నేరుగా అందించేందుకు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు వెల్లడించాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది.