చంద్రబాబు అరెస్ట్ మూడేళ్లు: రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ డే పాటించాలని లోకేశ్ పిలుపు
రిపోర్టర్: సతీష్
స్థలం: గుంటూరు
చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ రోజును బ్లాక్ డేగా పాటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 53 దీపాలు వెలిగించాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఐదేళ్లలో 30 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, పార్టీ, పర్సనల్, ప్రభుత్వం విజయానికి మూడు మంత్రాలని ఆయన స్పష్టం చేశారు.