తెర్లాం మండలంలో విషాదం: పొలం నుంచి వస్తుండగా పాముకాటుకు గురై రైతు మృతి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెర్లాం
తెర్లాం మండలంలోని అప్పలంపేట గ్రామానికి చెందిన సాకేటి నాగభూషణరావు వరి పొలానికి నీరు పెట్టి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో పాముకాటుకు గురయ్యారని పోలీసులు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున మృతి చెందారని ఎస్సై బి.సాగర్ బాబు పేర్కొన్నారు. భార్య కల్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.