ముంబైకి మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరాంగే పాదయాత్ర
రిపోర్టర్: కృష్ణ
స్థలం: మహారాష్ట్ర
మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరాంగే జాల్నా నుంచి ముంబైకి పాదయాత్ర ప్రారంభించారు. ప్రభుత్వం తన డిమాండ్లను పట్టించుకోలేదని మండిపడుతూ, సెప్టెంబర్ 19న ఆజాద్ మైదాన్ లో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంతో మరో పోరుకు సిద్ధమైన జరాంగే, ఎంతటివారైనా వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు పండుగ వేళ ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కోరారు.