జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ రికార్డు: తొలిరోజే మూడు రెట్లు సబ్స్క్రైబ్ చేసిన ఇన్వెస్టర్లు

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్ఫామ్స్ మెగా ఐపీఓ తొలిరోజే మూడు రెట్లు సబ్స్క్రైబ్ అయిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యంగా వచ్చిన ఈ పబ్లిక్ ఆఫర్కు యాంకర్ ఇన్వెస్టర్ల వాటాతో కలిపి తొలిరోజే రూ.74,610 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల విభాగంలో భారీ డిమాండ్ నెలకొనగా, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది.