పొన్నూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం: తొంభై లక్షలతో తాగునీటి పథకానికి శంకుస్థాపన
రిపోర్టర్: సురేష్
స్థలం: గుంటూరు
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా తొంభై లక్షల రూపాయల జలజీవన్ మిషన్ తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెల్లడించారు. గ్రామ పెద్దలు, కూటమి పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగిందని ఆయన తెలిపారు. కొత్త ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం మరియు పైప్లైన్ వ్యవస్థ విస్తరణ ద్వారా ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందుతుందని పేర్కొంటూ ఆయన ఈ వివరాలను పంచుకున్నారు.