పాఠశాలల పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంపై విద్యాశాఖ కీలక నిర్ణయం
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఏ ఒకటి మరియు ఎస్ఏ రెండు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రమే బాహ్య మూల్యాంకనం నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే తొమ్మిది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఆరో తరగతి పేపర్లను ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో దిద్దించనుంది. పేపర్ల తరలింపు మరియు బోధనలో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో తొలుత తీసుకున్న అన్ని తరగతుల నిర్ణయాన్ని విద్యాశాఖ తాజాగా మార్చుకుంది.