సచివాలయ సిబ్బంది ఆందోళనలో అపశ్రుతి
రిపోర్టర్: santhoshkumar
స్థలం: గాజువాక
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సచివాలయ ఉద్యోగుల నిరసనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉదయం నుంచి వందలాది మంది ఉద్యోగులు నడిరోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈస్ట్ జోన్కు చెందిన ఉద్యోగి రమణ అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే KGH ఆసుపత్రికి తరలించారు. మరో ఉద్యోగి కూడా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో ఆందోళన ప్రదేశంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.