రాప్తాడు విద్యార్థిని ఆరోగ్యంపై మంత్రి నారా లోకేశ్ కీలక అప్డేట్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడులో రంపంతో దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని క్రమంగా కోలుకుంటోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తాజాగా ఆ చిన్నారి కళ్లు తెరిచిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. వైద్యుల ప్రాథమిక పరీక్షల్ లో ఎలాంటి ప్రధాన సమస్యలు గుర్తించలేదని, ఈ వారం చివర్ లో మరోసారి కంటి పరీక్షలతో పాటు ఆర్థ్రో సర్జరీ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.