దేశ వ్యవస్థను ఆరుగురు వ్యక్తులు కబ్జా చేశారన్న రాహుల్ గాంధీ
రిపోర్టర్: శివ
స్థలం: ఇండోర్
దేశంలో ఒక ప్రత్యేక వ్యవస్థ నడుస్తోందని, ఆ వ్యవస్థ దేశాన్ని చుట్టుముట్టి కబ్జా చేసి కూర్చుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇండోర్ లో నిర్వహించిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యవస్థ మధ్యలో మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్, మోహన్ భగవత్, అదానీ, అంబానీ అనే ఆరుగురు వ్యక్తులు ఉన్నారని ఘాటు విమర్శలు గుప్పించారు.