సహకార రంగానికి వన్నెతెచ్చేలా సింగిల్ విండో బాధ్యతలు స్వీకరించిన రవీందర్

రిపోర్టర్: Damidi Chandra Reddy స్థలం: హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండల సింగిల్ విండో చైర్మన్ గా చిటుమల్ల రవీందర్ శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం, సంఘం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డితో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.