స్త్రీల కాలేజీ సమీపంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
రిపోర్టర్: సురేష్
స్థలం: New Delhi
న్యూఢిల్లీలోని కల్కాజీ మందిర్ సమీపంలోని ఆస్తా కుంజ్ పార్కులో పదిహేడేళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనపై లేడీ శ్రీరామ్ కాలేజీ స్పందించి తరగతులను ఆన్‌లైన్‌కు మార్చింది. నిందితులు హేమంత్, ముకేష్, ఆసిఫ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఎయిమ్స్‌లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.