ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు మరో అవకాశం: నవంబర్ 4న ఆన్ లైన్ లాటరీ
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకంలో ఖాళీగా ఉన్న ఫ్లాట్ల భర్తీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని హౌసింగ్ బోర్డు అధికారులు వెల్లడించారు. తొలి విడతలో ఫ్లాట్లు పొందిన లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత కారణాలతో కేటాయింపులను వదులుకోవడంతో కొన్ని ఫ్లాట్లు మిగిలిపోయాయని తెలిపారు. ఈ నేపథ్యంలో నవంబర్ 4న ఆన్ లైన్ ద్వారా మరోసారి లాటరీ నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.