'పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం': కలెక్టర్ రాంసుందర్ రెడ్డి

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా కేంద్రంలోని వసంతవిహార్ వద్ద గురువారం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా పిచ్చిమొక్కలను తొలగించారు. అక్టోబర్ 2 వరకు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలు భాగస్వామ్యులై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. చెత్తను ఆరుబయట వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, ఇంజినీర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.