మతపరమైన పదాలు వాడిన ఐపీఎస్ అధికారిణి బుష్రా బానో బదిలీ
రిపోర్టర్: మహేష్
స్థలం: పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్పూర్ అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి డాక్టర్ బుష్రా బానో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో తీవ్ర వివాదానికి దారితీసింది. ఆమె తన సివిల్స్ ప్రయాణాన్ని వివరిస్తూ అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లాహ్ వంటి మతపరమైన పదాలు వాడటాన్ని హిందూ లీగల్ ఫండ్ తప్పుపట్టింది. లౌకికత్వాన్ని పాటించాలంటూ ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఆమెను పశ్చిమ బెంగాల్ ఆర్మడ్ పోలీస్ డిప్యూటీ కమాండెంట్‌గా బదిలీ చేసింది.