టాలీవుడ్ లో ఆనందం: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దర్శకుడు అభిషన్ భార్య
రిపోర్టర్: సునీల్
స్థలం: చెన్నై
తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ యువ దర్శకుడు మరియు నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అభిషన్ జీవింత్ ఇంట ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన భార్య అఖిల తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారని, పెళ్లయిన ఏడాది తిరిగేసరికి తమ ప్రేమ బంధానికి ప్రతిరూపంగా బిడ్డ జన్మించడంతో ఈ దంపతులు సంతోషంలో తేలిపోతున్నారని తెలిపారు. కూతురిని చేతుల్ లో పట్టుకున్న క్యూట్ ఫోటోను సామాజిక మాధ్యమాలలో పంచుకుంటూ తాను తండ్రినయ్యానని అభిషన్ భావోద్వేగంగా వెల్లడించారు.