మక్తల్ లో గలగల మత్తు: సరిహద్దులు దాటి వస్తున్న గంజాయి గుట్టురట్టు
రిపోర్టర్: రమేష్
స్థలం: మక్తల్
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో గంజాయి దందా విచ్చలవిడిగా సాగుతోందని, కర్ణాటక మరియు మహారాష్ట్ర సరిహద్దుల గుండా మత్తు పదార్థాలు అక్రమంగా తరలివస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ, మాగనూరు, మక్తల్, నర్వ మండలాల్ లోని పల్లెలకు ఈ జాడ్యం వేగంగా విస్తరిస్తోందని, యువత వ్యసనాలకు బానిసలై నేరాల బాట పడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధాన సూత్రధారులు తప్పించుకుంటూ దందాను సాగిస్తుండటంతో పోలీసులు నిఘా మరింత కఠినతరం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.