రాసగుప్పలో అంగన్వాడీ కేంద్రం ప్రారంభం
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పెదబయలు
ASR జిల్లా పెదబయలు మండలం: కుంతుర్ల పంచాయతీ రాసగుప్ప గ్రామంలో ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాన్ని అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు వంతాల రామన్న, ఎంపీటీసీ పాంగి రామారావు, వంతాల రమణ, భాస్కరరావు, పాంగి బాబురావు, కుంతుర్ల ఎంపీటీసీ కృష్ణపడాల్, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను పూలమాలతో సత్కరించారు.