మన్నే క్రిశాంక్‌పై దాడులకు బెదిరింపులు: తెలంగాణ పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం
రిపోర్టర్: మహేష్
స్థలం: రాజన్న సిరిసిల్ల
మన్నే క్రిశాంక్‌పై కాంగ్రెస్ శ్రేణులు బహిరంగంగా భౌతిక దాడుల హెచ్చరికలు జారీ చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని తాము ప్రశ్నిస్తుంటేనే అధికార పార్టీ నేతలు ఇలా బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. డీజేలను సీజ్ చేయడంపై దృష్టి పెట్టిన పోలీసులు ప్రజాస్వామ్య రక్షణను గాలికొదిలేశారని విమర్శిస్తూ శాంతిభద్రతల వైఫల్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.