సేవాయాత్ర సభ్యులతో మోదీ వర్చువల్ ముచ్చటన్న బీజేపీ
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
వడ్నగర్ నుండి వారణాసి వరకు సాగుతున్న సేవాయాత్రలో పాల్గొంటున్న సేవాయాత్రికులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లైవ్ లో ముచ్చటించారు. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేక సంభాషణ కొనసాగినట్లు బీజేపీ తెలంగాణ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసే లక్ష్యంతో ఈ యాత్ర కొనసాగుతోందని పార్టీ నేతలు తెలిపారు.