సూర్యాపేటలో హైటెన్షన్ అఖిలపక్ష బంద్ ఉద్రిక్తత

రిపోర్టర్: సతీష్ స్థలం: సూర్యాపేట

సూర్యాపేటలో అఖిలపక్ష సంఘాల బంద్ పిలుపుతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సూర్యాపేట-విజయవాడ మధ్య తలపెట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనను తక్షణమే మార్చాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు బస్సు డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన నేపథ్యంలో స్థానికంగా హైటెన్షన్ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు భారీగా మోహరించి తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.