ఢిల్లీ రామ్ లీలా మైదానంలో కదంతొక్కిన ఆలేరు కాంగ్రెస్ శ్రేణులు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల కాంగ్రెస్ నాయకులు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నాయకత్వంలో ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిరసనలో పాల్గొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాజాపేట నుంచి పీఏసీఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్, బుడిగే పెంటయ్య గౌడ్ సహా పలువురు ప్రముఖులు ఈ ఆందోళనలో నినాదాలు చేశారు.