హుస్నాబాద్ పట్టణంలో ఘనంగా వన మహోత్సవం
రిపోర్టర్: chandrareddy damidi
స్థలం: హుస్నాబాద్
హుస్నాబాద్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున రెండో వార్డులో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వార్డులో ఇంటింటికి పూల మొక్కలను హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ మరియు మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి గార్ల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, స్థానిక కౌన్సిలర్లు బూర్గు లత, పూదరి వరప్రసాద్, కేశవేణి రమేష్, కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు వడ్డేపల్లి వెంకటరమణ, బొల్లి శ్రీనివాస్, కాలనీ వాసులు పాల్గొన్నారు.