బాలికలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్ అందించిన ఎఫ్పీఏ ఇండియా
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా ఎఫ్పీఏ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో పంజగుట్ట కార్యాలయంలో బాలికలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు సంస్థ చైర్పర్సన్ డాక్టర్ ఈ. ప్రభావతి తెలిపారు. తొమ్మిది నుంచి ఇరవై ఏళ్లలోపు వయసున్న యాభై నలుగురు బాలికలకు వైద్యులు విజయవంతంగా టీకాలు వేశారు. యుక్తవయసులోనే ఈ టీకా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే క్యాన్సర్ ముప్పును సమర్థవంతంగా అరికట్టవచ్చని ఈ సందర్భంగా వైద్యులు స్పష్టం చేశారు.