కళ్యాణదుర్గం ప్రజల సంక్షేమమే తన అభిమతమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పష్టీకరణ
రిపోర్టర్: విజయ్
స్థలం: Sri Sathya Sai District
కళ్యాణదుర్గం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు రూ.179 కోట్లతో చేపట్టిన ఇంటింటికీ కుళాయి పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ ద్వారా రూ.200.87 కోట్లతో చేపట్టనున్న పనులకు సీఎం చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపన చేశారని విద్యానగర్లో నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్నారు.