గూడూరులో భారీగా బంగారం వెండి అక్రమ నిల్వలు సీజ్ చేసిన విజిలెన్స్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: నెల్లూరు
గూడూరు పట్టణంలో కొందరు బంగారు దుకాణదారులు ప్రభుత్వానికి జీఎస్టీ ఎగ్గొడుతూ అక్రమ వ్యాపారానికి తెరతీశారని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. రికార్డుల్లో చూపని సుమారు పదకొండు కోట్ల విలువైన బంగారం మరియు నలభై మూడు కోట్ల విలువైన వెండి నిల్వలను ఆకస్మిక తాడుల్లో అధికారులు సీజ్ చేశారు. హాల్ మార్క్ లేని ఆభరణాలను విక్రయిస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రజలను మోసగిస్తున్నారని, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.