అట్టహాసంగా విడుదలైన శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమా టీజర్

రిపోర్టర్: రమేష్ స్థలం: విశాఖపట్నం

వర్సటైల్ నటుడు శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న 'కామ్రేడ్ కళ్యాణ్' టీజర్ విడుదలైంది. 1992లో విశాఖపట్నం మాడుగుల నేపథ్యంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు జానకీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక సాధారణ వ్యక్తి నక్సలైట్‌గా మారే క్రమాన్ని కామెడీ, ఎమోషన్స్ మేళవించి చూపడం ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.