వైద్య సేవలపై ఎమ్మెల్యే ఆరా: నర్రవాడ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సురేష్

రిపోర్టర్: కృష్ణ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశించారు. దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల తీరును పరిశీలించి, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందేలా నిరంతరం అందుబాటులో ఉండాలని అధికారులకు స్పష్టం చేసినట్లు కాకర్ల సురేష్ తెలిపారు.