'అమరావతి విశేషాలతో సీఆర్‌డీఏ కార్యాలయంలో ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌': అమరావతిలో సరికొత్త కేంద్రం ఏర్పాటు

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

అమరావతి రాజధాని ప్రస్థానం, చారిత్రక నేపథ్యం మరియు నిర్మాణ పురోగతిని సందర్శకులకు వివరించేందుకు అమరావతిలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో అత్యాధునిక హంగులతో ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రైవేటు సంస్థల నుంచి సీఆర్‌డీఏ బిడ్‌లు ఆహ్వానించింది. పెట్టుబడిదారులు, విద్యార్థులకు రాజధాని విశేషాలను డిజిటల్ వాల్స్, హోలోగ్రాఫిక్ ఇన్‌స్టలేషన్ల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించడమే ఈ కేంద్రం ఏర్పాటు ప్రధాన ఉద్దేశం.