పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జీవో 153ను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గతంలో అమల్లో ఉన్న జీవో 105లో సవరణలు చేస్తూ ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఖరారు చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ తో పాటు జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.