జాతీయ రహదారిపై లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: తొండంగి
తొండంగి మండలం బెండపూడి జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో పలివెల రాజా, కర్రి శివాజీ అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో చిన్ననాటి స్నేహితులు ప్రాణాలు కోల్పోవడంతో స్వగ్రామం కొత్తూరులో తీవ్ర విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.