తెలంగాణలో కరువుకు రేవంత్ వైఫల్యమే కారణమంటూ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమర్థ పాలన వల్లే అక్కడ కరువు పరిస్థితులు తలెత్తలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. పక్క రాష్ట్రంలో సానుకూల పరిస్థితులు ఉంటే, తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యం వల్ల కరువు ఛాయలు అలుముకున్నాయని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణమాల వల్లే భాగ్యనగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తూ రేవంత్ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.